లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

KMR: సీతాయిపల్లిలో ఆదివారం సీఎం సహాయనిధి చెక్కును వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరమేశ్ లబ్ధిదారులకు అందజేశారు. రూ.1.53 లక్ష విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, రాజమల్లు, సాయిబాబా ఉన్నారు.