దిగ్గజ క్రికెటర్ హఠాన్మరణం

దిగ్గజ క్రికెటర్ హఠాన్మరణం

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. అయితే, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్మిత్ 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించి 62 టెస్టుల్లో 9 సెంచరీలతో సహా 4236 పరుగులు చేశారు. అలాగే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హాంప్‌షైర్ కౌంటీ తరఫున 18,984 పరుగులు సాధించారు.