ప్రతి పోలీస్ స్టేషన్‌కు డ్రోన్స్ కేటాయింపు

ELR: సీసీ కెమెరాలు మరియు డ్రోన్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి అనిత అన్నారు. బుధవారం పోలవరం పోలీస్ స్టేషన్‌లో ఆమె మాట్లాడుతూ.. గంజాయి రహిత రాష్ట్రం నిర్మాణం కొరకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.