నేడు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం

నేడు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం

కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు ఉచిత హోమియో వైద్య శిబిరం,  మధ్యాహ్నం 3గంటలు నుంచి 5గంటలు వరకూ గుండె, షుగర్, గ్యాస్ట్రిక్, జనరల్ వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.