కాలువలో మృతదేహం.. నంద్యాల వాసిగా గుర్తింపు..!

కాలువలో మృతదేహం.. నంద్యాల వాసిగా గుర్తింపు..!

NDL: బనగానపల్లె మండలం ఐ. కొత్తపేట గ్రామ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుడు నంద్యాల పట్టణ వాసిగా గుర్తించినట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. ఆధారాలను బట్టి నంద్యాలలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించే షేక్ జాకీర్ బాషా(43)గా గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.