పెట్రోల్ తాగి యువకుడు మృతి

పెట్రోల్ తాగి యువకుడు మృతి

SDPT: దుబ్బాక మండలం లచ్చపేటలో మద్యం మత్తులో పెట్రోల్ తాగిన యువకుడు ఎండి.ఫయాజ్(22) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మద్యానికి బానిసైన ఫయాజ్, ఈనెల 16న తన బైక్‌లోని పెట్రోల్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుని చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.