'దివ్యాంగుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది'
E.G: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. ఆదివారం నిడదవోలు చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహించిన మాసోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.