VIDEO: రామచంద్రపురం క్రీడాకారిణికి స్వర్ణ పథకం

VIDEO: రామచంద్రపురం క్రీడాకారిణికి స్వర్ణ పథకం

కోనసీమ: మహిళా దినోత్సవం రోజున రామచంద్రపురంకి చెందిన యువతి కిక్ బాక్సింగ్లో సత్తా చాటింది. బెంగళూరులో ఆదివారం జరిగిన అస్మిత ఖేల్ ఇండియా ఉమెన్స్ సౌత్ జోన్ కిక్ బాక్సింగ్ పోటీల్లో కారుమూరి లేఖా నిహారిక స్వర్ణ పథకం సాధించింది. ఫైనల్ పోరులో తమిళనాడుకు చెందిన జీవితను ఓడించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నిహారికను పలువురు అభినందించారు.