హనుమాన్ ఆలయంలో వనమహోత్సవ కార్యక్రమం

NZB: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శ్రావణ శనివారం పురస్కరించుకొని వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.