సోమందేపల్లిలో ఘనంగా భగీరథ జయంతి వేడుకలు
సత్యసాయి: సోమందేపల్లిలోని భగీరథ సర్కిల్‌లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం బాణసంచా కాల్చి, కేక్ కట్ చేశారు.