చేపల చెరువులో పడి వ్యక్తి మృతి
BDK: చేపల చెరువులో జారి పడి కాపలాదారు మృతి చెందారు. అశ్వారావుపేట మండలం పాకలగూడెనికి చెందిన ఎర్రప్ప (65) ఆసుపాకలోని ఓ చేపల చెరువు వద్ద గత కొన్ని రోజులుగా కాపలాదారుడుగా ఉంటున్నాడు. రెండు రోజుల నుంచి ఎర్రప్ప కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం చేపల చెరువులో ఎర్రప్ప మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి సోదరి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.