జగ్గాపురంలో ఆటో బ్యాటరీల దొంగతనం కలకలం

జగ్గాపురంలో ఆటో బ్యాటరీల దొంగతనం కలకలం

PLD: ఎడ్లపాడు(M) జగ్గాపురం గ్రామంలో ఆటో బ్యాటరీల దొంగతనం జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది ఆటోల బ్యాటరీలు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. పొపురి వంశీతో పాటు మరో ఏడుగురు డ్రైవర్లు మొత్తం విలువ రూ.60 వేలు నష్టం చవిచూశారు. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.