VIDEO: 'శ్రామిక మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి'
NRML: ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 8న ఆదిలాబాద్ జిల్లా మావలలో నిర్వహించే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఐబి లో వారు కరపత్రాలను విడుదల చేశారు. ఆదివాసి ప్రజలు ఎక్కువ సంఖ్యలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.