త్వరలో చెక్ పోస్ట్ ఏర్పాటు: ఎస్పీ
VZM: ఎస్పీ దామోదర్ మంగళవారం గంట్యాడ, ఆండ్ర పోలీస్ స్టేషన్లను, పిట్టాడ చెక్ పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సిడి ఫైళ్లను నిశితంగా పరిశీలించిన ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ-రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ రహదారిపై పెరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు, ప్రమాదాల నివారణకు త్వరలోనే చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.