మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా గుండెలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఖలిదా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 12 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఖలిదా రెండు పర్యాయాలు బంగ్లా ప్రధానిగా సేవలందించారు.