యాజమాన్య హక్కులు కల్పించేందుకు స్వామిత్వ పథకం
AKP: ప్రజలకు వారి ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని అమలు చేస్తున్నట్లు డీడీవో నాగలక్ష్మి అన్నారు. గురువారం రాంబిల్లి మండలం హరిపురం గ్రామంలో దీనిపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ధూళి రంగనాయకులు మాట్లాడుతూ.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.