కారు డ్రైవర్లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ

HYD: JBSపై ఆధారపడి టాక్సీలు నడిపే కారు డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ని కలిశారు. ఈ సందర్భంగా తాము కార్లు పార్కింగ్ చేసే ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర డ్రైవర్స్ యూనియన్ తరపున సమస్యలు పరిష్కరించాలని కోరారు. వీటికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.