'రోడ్లపై పశువులు సంచరిస్తే గోశాలకు తరలిస్తాం'

MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలో యజమానులు పశువులను యథేచ్ఛగా వదలడంతో రోడ్లపై సంచరిస్తున్నాయని, వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదాలు జరిగి గాయాలపాలవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్‌లు శనివారం అన్నారు. ప్రకటన వెలువడిన 48 గంటలలోగా పశువులను తీసుకువెళ్లాలని, లేనియెడల పశువులను గోశాలలకు తరలిస్తామని అన్నారు.