గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
NZB: నగర శివారులోని ఖానాపూర్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రామ్‌నాథ్ మెహతాను అరెస్టు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అతన్ని పట్టుకోగా 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే అక్కడికి వచ్చిన ఏడుగురికి గంజాయి కన్జ్యూమర్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు.