భూమిపై ఉన్న పెద్ద క్యాన్సర్‌ను తొలగిస్తున్నాం: ట్రంప్
ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భూమిపై ఉన్న పెద్ద క్యాన్సర్‌ను తొలగిస్తున్నామని వ్యాఖ్యానించారు. తాము చేస్తున్న పని అమెరికా, ఇజ్రాయెల్‌కే కాదని.. ప్రపంచానికే గొప్ప మేలు అని పేర్కొన్నారు. బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్‌ను హెచ్చరిస్తున్నామని చెప్పారు. అలాగే, చమురు ధరలు పెరుగుతాయని.. అంతే వేగంగా తగ్గుతాయని తెలిపారు.