VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
HNK: ధర్మసాగర్(M) కర్ణపురం ఓఆర్‌ఆర్ వద్ద ఇవాళ ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.