విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
KDP: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు దేవగుడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, జమ్మలమడుగు మండల కేంద్రంలోని పీఆర్ జడ్పీ హైస్కూలు ప్రాంగణంలో నూతనంగా నిర్వహణలోకి తీసుకువచ్చిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లను కలెక్టర్ పరిశీలించారు.