గోరక్షక్ ప్రశాంత్‌పై దాడి పాశవికం: బీజేపీ
GDWL: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో గోరక్షక్ ప్రశాంత్‌పై బుల్లెట్ దాడికి పాల్పడిన ఇబ్రహీం బృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోవులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్న గోరక్షకులపై దాడిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చాలా కాలంగా ఇటువంటి దాడులు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవట్లేరన్నారు.