చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ముల మృతి

చెరువులో పడి  ఇద్దరు అన్నదమ్ముల మృతి

NRML: ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ పట్టణం బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేయగా గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లి ఇద్దరూ చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.