సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఏకగ్రీవ ఎన్నిక

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, ఇతర నేతలు బలపరిచారు. వరుసగా రెండోసారి ఎన్నికైన కూనంనేని మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు.