'భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం'
SKLM: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా జలధార -జల హారతి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రజలను, నీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలన్నారు.