అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే
అన్నమయ్య: పీలేరు మండలం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిని లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతులను ఆర్థిక, సాంకేతికంగా మరింత బలోపేతం చేసే చర్యలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను అభినందించారు.