ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
GNTR: దుర్గి (మం) ఓబులేసునిపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన నేలపాటి సందీప్ (21), సోఫియా (20)లు సాగరమాత ఆలయ దర్శనం చేసుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా, ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.