సైరన్లు వినియోగిస్తే చర్యలు: ట్రాఫిక్ డీసీపీ
NTR: విజయవాడలో అనధికారికంగా సైరన్లు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం హెచ్చరించారు. ఈమేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అయితే అంబులెన్స్‌లు, సీఎం, పీఎం, పోలీస్ కాన్వాయ్‌లకు మాత్రమే నిబంధనల మేరకు సైరన్ వినియోగించే అవకాశం ఉందన్నారు. ఖాళీ అంబులెన్సులు సైరన్లు వినియోగించిన చర్యలు తీసుకుంటామన్నారు.