పాఠశాలను తనిఖీ చేసిన పానెల్ తనిఖీ బృందం
BHNG: గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ప్యానల్ ఇన్స్‌స్పెక్షన్ బృందం తనిఖీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసింది. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, మధ్యాహ్న భోజనం, వివిధ రకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో టీం సభ్యులు రవి కిరణ్, సత్తిరెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.