పేరుకుపోయిన చెత్త.. రోగాల భయంలో గ్రామస్తులు!
VKB: కొట్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో చెత్త కుప్పలు పేరుకుపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో రాకపోకలు సాగించడం నరకంగా మారిందని, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరుతున్నారు.