గణపయ్య పండగకు మండపాల ఏర్పాట్లు షురూ

ATP: అనంతపురంలో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 27న బుధవారం చవితి పండగ కాగా నగరంలోని సప్తగిరి సర్కిల్ వినాయక చౌకులో భారీ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. వివిధ డిజైన్లతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. నగరంలోని పలు వీధుల్లో మండపాల పనులు జోరుగా సాగుతున్నాయి. వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.