స్ఫూర్తి వాకర్స్ క్లబ్ సేవలు అభినందనీయం

VZM: స్ఫూర్తి వాకర్స్ క్లబ్ సేవలు అభినందనీయమని గజపతినగరం సబ్ రిజిస్టార్ ఏ చిన్నమ్మలు అన్నారు. శనివారం గజపతినగరం జాతీయ రహదారి పక్కన స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఆమె సందర్శించారు. నిరంతరం ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు బొంతలకోటి శంకర్రావు పాల్గొన్నారు.