'పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తి'
జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మూడో ర్యాండమైజేషన్ ద్వారా పూర్తయిందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. 1531 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2031 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి, ఏడు మండలాల్లో బ్యాలెట్ బాక్సుల తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు.