ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
VZM: గుర్ల మండలంలోని గూడెం, పాలవలస గ్రామాల్లో ఈరోజు ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారిణి వై.మణి ఆధ్వర్యంలో విజయనగరం అర్బన్, రూరల్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది రక్త నమూనాలు సేకరించారు. 20 సంవత్సరాలు వయసు దాటిన వారికి రెండు గ్రామాల్లోనూ మొత్తం 600 మందికి ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.