ఉమ్మడి జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
WGL: ఉమ్మడి జిల్లా మహిళలకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో సత్తా చాటుతున్న మహిళా శక్తికి హృదయపూర్వక వందనం తెలిపారు. మహిళలు సమాజంలో సమానత్వం, సాధికారత కోసం అవిరామంగా కృషి చేస్తున్నారని అన్నారు.