కొండారెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి

కొండారెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు: మాజీ మంత్రి

AP: వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 'నకిలీ మద్యంలో వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు కొండారెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. ఈనెల 2వ తేదీ ఉదయం 7:10 గంటలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, సాయంత్రం అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ మధ్యలో కొండారెడ్డి అరెస్ట్ వీడియో ఎలా వచ్చింది' అని ప్రశ్నించారు.