కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోనసీమ: మండపేట మండలం కేశవరం సొసైటీ ఆవరణలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేశవరం సొసైటీ అధ్యక్షులు ఉండమట్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉండమట్ల వాసు, సొసైటీ డైరెక్టర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.