A.B.A.P రాష్ట్ర కమిటీ సభ్యుడిగా భూపతి శ్రీనివాస్

A.B.A.P  రాష్ట్ర కమిటీ సభ్యుడిగా భూపతి శ్రీనివాస్

SRPT: సూర్యాపేటకు చెందిన భూపతి శ్రీనివాస్ గురుస్వామి, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. పుల్లంరాజు తెలిపారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి భూపతి శ్రీనివాస్ సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.