తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
MDK: ప్రజల్లో ఐక్యత, ఆత్మగౌరవం పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని డీఆర్‌వో భుజంగరావు పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ అవతరణ ఉత్సవం పురస్కరించుకుని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపట్టారు. రోడ్లు భవనాల శాఖ ఈఈ వేణు, అదనపు ఎస్పీ మహేందర్, డీఈ కరుణ, అరుణ్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.