VIDEO: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి గ్రామంలో సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన కోసం పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.