పొదిలి పొగాకు బోర్డు అధికారి గిరిరాజా కుమార్ బదిలీ
ప్రకాశం: పొదిలి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి గిరిరాజాకుమార్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గోపాలపురంలో పనిచేస్తున్న రామ్ మోహన్‌ను నియమించారు. త్వరలో ఆయన పొదిలికి వస్తారు. కాగా గిరిరాజా కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టి రైతుల మన్ననలు పొందారు.