' పురిటి బిడ్డను వదిలేసి వెళ్లారు’

' పురిటి బిడ్డను వదిలేసి వెళ్లారు’

NDL: నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పురిటి బిడ్డను కన్నతల్లి వదిలివేసి వెళ్లిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది మాట్లాడారు. ఆడపిల్ల కావడంతో రాత్రి 11 గంటల తర్వాత తల్లి వదిలిపెట్టి వెళ్లిందని తెలిపారు. విషయం ఐసీడీఎస్ సీడీపీవో మంగవల్లికి తెలియజేశామన్నారు. పసికందును బాలిక సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లినట్లు చెప్పారు.