TBMBA 2.0లో భాగంగా కార్మికులకు వైద్య సేవలు
JGL: జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ కోరుట్ల పట్టణంలోని బ్రిక్‌లైన్‌ను సందర్శించి TBMBA 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి స్పుటమ్ కప్పులు పంపిణీ చేసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.