అల్లూరి జిల్లాలో ఉద్యాన శాస్త్రవేత్తల సర్వే

AP: అల్లూరి జిల్లాలోని గరడగూడ, ఇరగాయి, పనకగూడలో ఉద్యాన శాస్త్రవేత్తలు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా 154 ఎకరాల్లో కాఫీ పంటలకు తెగులు సోకినట్లు గుర్తించారు. 85 ఎకరాలు రెడ్ జోన్, 69 ఎకరాలు ఎల్లో జోన్‌గా ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. ఈనెలాఖరులోగా ఉద్యాన శాస్త్రవేత్తల సర్వే పూర్తి కానుంది.