VIDEO: జిల్లాలో కల్తీ బెల్లం కలకలం.!
KKD: పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో కల్తీ బెల్లం తయారీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్లం రంగు కోసం యూరియా, సల్ఫేట్, జింక్ వంటి రసాయనాలు వాడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కల్తీ పాల ఘటన మరువక ముందే బెల్లం భయం పట్టుకుందని, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రపోతున్నారని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.