బ్రాహ్మణపల్లిలో హై వోల్టేజీతో ఇబ్బందులు
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో ఆకస్మికంగా వచ్చిన హై వోల్టేజీ కారణంగా పలువురు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైవోల్టేజీ వల్ల ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఇన్వర్టర్లు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయి, దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టంపై విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.