కొమ్మాలపాడులో దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
బాపట్ల: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో గురువారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఫోన్ దొంగతనానికి యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు వారిని గమనించగా ఇద్దరు పారిపోయారు. ఒకరు పట్టుబడగా గ్రామస్తులు అతనిపై దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని 108 సిబ్బంది నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.