ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు అందజేత

E.G: అనపర్తి కొత్తూరుకి చెందిన కర్రీ భరత్ రెడ్డి విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసి రూ.50వేలు విలువ గల డిడిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.