అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు

WGL: ఆర్టీసి బస్సు అదుపతప్పి పొలాల్లోకి వెళ్లిన సంఘటన వరంగల్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు చెన్నరావుపెట మండలం తిమ్మరైనిపహడ్ గ్రామ శివారలో నర్సంపేట డిపో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కాగా..గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.